ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (09:50 IST)

మహాశివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు..

మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తె

మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాల్లో ప్రసిద్ధమైన శ్రీశైలంలో భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శివుని దర్శనం కోసం వేచివున్నారు. 
 
మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. విజయవాడలోని దుర్గాఘాట్‌, పద్మావతిఘాట్‌లో శివభక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాళేశ్వరంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నల్లగొండలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.
 
నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శివరాత్రి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్త జనం బారులు తీరారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ ఈస్‌గాంలోని శివ మల్లన్న ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.