శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 25 మే 2017 (19:48 IST)

తిరుమలకు ఉగ్రముప్పు - రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు...

తిరుమలకు ఉగ్ర ముప్పు ఉందా.. అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు. కేంద్ర ఇంటెలిజెన్స్‌కు వచ్చిన పక్కా సమాచారం దేశంలోని ప్రధాన ఆలయాలపై ఉగ్రవాదులు కన్నేశారని. ఆలయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు వారు పాల్పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం వచ్చిందట. దీంత

తిరుమలకు ఉగ్ర ముప్పు ఉందా.. అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు. కేంద్ర ఇంటెలిజెన్స్‌కు వచ్చిన పక్కా సమాచారం దేశంలోని ప్రధాన ఆలయాలపై ఉగ్రవాదులు కన్నేశారని. ఆలయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు వారు పాల్పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం వచ్చిందట. దీంతో తిరుపతి, తిరుమలలో పోలీసులు అప్రమత్తమ్యారు. 
 
క్షుణ్ణంగా ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అంతేకాదు తిరుమలకు ప్రత్యేకంగా ఆక్టోపస్ బలగాలు వచ్చాయి. పదిమందికిపైగా ఆక్టోపస్ బలగాలు తిరుమల చుట్టూ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ఆక్టోపస్ బలగాలు.
 
తిరుమలకు హెచ్చరికలు కొత్తేమీ కాదు. విమానాశ్రయాల్లో బాంబుల కలకలం... మావోయిస్టులు అడవుల్లో విధ్వంసం సృష్టించడం ఇలా చేస్తుంటే వెంటనే తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారిమెట్టు, సప్తగిరి తనిఖీ కేంద్రం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే పంపిస్తున్నారు. భక్తుల గుర్తింపు కార్డులు చూసిన తరువాతనే పంపిస్తున్నారు.