1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Sri venkateswara temple in Amaravathi

అమరావతిలో కృష్ణానది ఒడ్డున శ్రీవారి ఆలయం: మంత్రి నారాయణ

Sri venkateswara temple
అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం సింగపూర్ మంత్రి షణ్ముగన్‌తో కలిసి మంత్రి నారాయణ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్‌తో షణ్ముగంతో కలిసి మంత్రి నారాయణ వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతిలో సుప్రసిద్ధ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించామని.. అందుకే శ్రీవారి ఆలయాన్ని కృష్ణానది ఒడ్డున నిర్మించాలనే ఉద్దేశంతో ప్రాథమిక చర్చలు జరిపామన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా చర్చలు జరుపుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
About Writer
Selvi