సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 9 మే 2016 (18:31 IST)

సింహాచలం అప్పన్నకు తితిదే ఈఓ పట్టువస్త్రాల సమర్పణ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు దంపతులు తితిదే తరపున సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. 
 
పవిత్రమైన అక్షయ తృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతియేటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తరపున తితిదే పట్టువస్త్రాలు సమర్పించింది.