ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 21 మే 2016 (12:36 IST)

వైభవోపేతంగా తిరుచానూరు పద్మావతి రథోత్సవం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఉదయం బంగారు రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహించింది. అమ్మవారిని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు ఆ తరువాత వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. నాలుగు మాఢావీధుల్లో అమ్మవారిని వైభవంగా వూరేగించారు. రథోత్సవం సందర్భంగా తిరుమాఢా వీధుల్లోని చలువ పందిళ్ళను తితిదే అధికారులు తొలగించారు.