తిరుమలలో 5 గంటల్లో శ్రీవారి దర్శనం
వారాంతపు సెలవు రోజైన ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగానే కనిపిస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 గంటల్లోపే లభిస్తోంది. శనివారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో లేదు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది.
కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల్లో దర్శన సమయం పడుతోంది. గదులు కూడా సులభంగానే భక్తులకు దొరుకుతున్నాయి. శనివారం శ్రీవారిని 81,097 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 91 లక్షలు వచ్చింది.