గంటలో శ్రీవారి దర్శనం... కాలి నడక భక్తులకు...
భక్తుల రద్దీతో కిక్కిరిసిన తిరుమల బుధవారం బోసిపోయి కనిపిస్తోంది. కేవలం గంటసేపులోనే శ్రీవారి దర్శనం అవుతోంది భక్తులకు. సర్వదర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. అలాగే నడక మార్గం భక్తులు ఒక కంపార్టుమెంటులో మాత్రమే వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులతో పాటు కాలినడక భక్తులకు కేవలం గంటలోపే దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని 59,189మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 18లక్షల రూపాయలు వచ్చింది.
