1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala Tirupathi Laddu

నేటి నుంచి తిరుచానూరులో శ్రీవారి లడ్డూల విక్రయం

Tirumala Tirupathi Laddu
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం నుంచి తిరుమల శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో భక్తుడికి ఒక లడ్డూను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇదిలావుండగా, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.36గంటలకు ధనుర్‌లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 
 
అంతకు ముందు ఉదయం 7.30 నుంచి 9గంటల మధ్య ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 8గంటలకు పద్మావతి అమ్మవారు చినశేషవాహనం తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
About Writer
pnr