1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. ttd devotee crowd

గంటలోనే శ్రీవారి దర్శనం..

ttd devotee crowd
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న దర్శనభాగ్యం శ్రీవారి భక్తులకు గంటలోనే లభిస్తోంది. పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటానికి కారణమని తితిదే భావిస్తోంది. భక్తులు లేకపోవడంతో తిరుమల గిరులు బోసిపోయి కనిపిస్తున్నాయి. క్యూలైన్లతో పాటు కంపార్టుమెంట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
 
మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటలోనే దర్శన భాగ్యం లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి కూడా గంటలోనే దర్శనం పూర్తవుతోంది. సోమవారం శ్రీవారిని 66,692 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.48 కోట్ల మేరకు వసూలైంది.
About Writer
ttdj