1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. ugadi celebrations on tirumala hills

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. భక్తులు రద్దీ సాధారణం

ugadi celebrations
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. తితిదే వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆస్థానాన్ని పూర్తి చేశారు. ఆలయం లోపల పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్‌ దీపాలంకరణలతో అందంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు.
 
తిరుమలలో రద్దీ మోస్తారుగా పెరిగింది. తెలుగు సంవత్సరాది ఉగాది కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారిని 7 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 2 గంటలకుపైగా సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 52,894 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.2.76 లక్షలు వచ్చింది. 
About Writer
ttdj