ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (12:55 IST)

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అం

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అంత గొప్ప ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటున్నారు. 
 
యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించగా కల్పాంతం తర్వాత ప్రళయం ఏర్పడుతుంది. వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడుతాడని నమ్మకం. పరమేశ్వరుని  చేత ఈ నగరం ప్రతిష్టితమైనదని అందుకనే ఎలాంటి ప్రళయాలు సంభవించినా ఆ నగరాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘంటాపథంగా పలుకుతున్నాయి