సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (12:58 IST)

తిరుపతిలో అపూర్వ ఘట్టం - వకుళామాత ఆలయానికి భూమి పూజ

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు వకుళామాత ఆలయానికి భూమి పూజ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో వకుళామాత ఆలయ నిర్మాణం చేసుకోమని తీర్పు వచ్చిన తర్వాత హింద

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు వకుళామాత ఆలయానికి భూమి పూజ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో వకుళామాత ఆలయ నిర్మాణం చేసుకోమని తీర్పు వచ్చిన తర్వాత హిందూ ధార్మికవేత్తలు పండుగ చేసుకున్నారు. 
 
తిరుపతి రూరల్‌లోని వకుళామాత ఆలయానికి భూమి పూజ పూర్తయ్యింది. 450 సంవత్సరాల పోరాటం తరువాత ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి శ్రీకారం చుట్టారు. దేశం నలుమూలల నుంచి 9 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు భూమి పూజలకు హాజరయ్యారు. అలాగే దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సాక్షాత్తు తిరుమల వెంకన్న తల్లి వకుళామాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందని దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు అన్నారు. త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తవుతుందని పరిపూర్ణానందస్వామి ధీమా వ్యక్తం చేశారు. వకుళామాత ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరించడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వేడుకతో పేరూరులో ఒక పండుగ వాతావరణం కనిపించింది.