సంబంధిత వార్తలు
- ముగ్గురు హీరోయిన్లపై ముచ్చటపడిన జూనియర్ ఎన్టీఆర్ (video)
- తెలంగాణలో కొత్తగా 415 పాజిటివ్ కేసులు.. ముగ్గురు మృతి
- ముగ్గురు మావయ్యలకు చూపిస్తా: హీరో సాయితేజ్ ఇంటర్వ్యూ
- ప్రాణాలు తీసిన జొన్నరొట్టె ... ఐదుగురు తిన్నారు .. ముగ్గురు చనిపోయారు!!
- జొన్నరొట్టెలు తిని.. ముగ్గురు మృతి.. భిక్షమెత్తి తెచ్చిన పిండితో..
బియ్యపు పిండితో ముగ్గు వేయాలి, ఎందుకంటే?
హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం ఎప్పుడూ వున్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది.
మన భూమికి వున్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం వుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.
అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుంది.
