శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (09:48 IST)

తెలంగాణలో కొత్తగా 415 పాజిటివ్ కేసులు.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 415 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గురువారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,541కి చేరింది.

కరోనాబారి నుంచి గురువారం 316 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,78,839కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,974 ఉండగా వీరిలో 3,823 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుందని కాస్త ఊపిరి పీల్చుకంటున్న సమయంలో యూకేనుంచి కొత్త వైరస్ స్ట్రెయిన్ దాడి ప్రారంభించింది. బ్రిటన్ రిటర్స్న్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి పట్ల అయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ సభలను నిషేధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.