1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

తెలంగాణలో కరోనా స్ట్రెయిన్.. అలెర్ట్.. తగ్గని కోవిడ్ కేసులు

కరోనా స్ట్రెయిన్ కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. తెలంగాణ వైద్య శాఖ ముఖ్య అధికారులు మంగళవారం సమావేశం అయ్యారు. యూకే స్ట్రెయిన్ కేసుల నమోదు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై వైద్య శాఖ ముఖ్య అధికారులు చర్చించారు. బ్రిటన్‌ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణలోకి ప్రవేశించింది. 
 
హైదరాబాద్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రెండు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ వ్యక్తికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే హైదరాబాద్ రెండు యూకే స్టెయిన్ కేసులను అధికారులు గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ద్వారా కరోనా స్ట్రెయిన్ కేసులను నిర్ధారించారు. అలాగే తెలంగాణలో కరోనా కేసులు తగ్గట్లేదు. తాజాగా 474 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1,538 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 5,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 2,78,523 మంది డిశ్చార్జ్ అయ్యారు.