మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (15:37 IST)

తెలంగాణ ఎన్నికల్లో గులాబీ దళం ముందంజ.. ''జయం జయం" సాంగ్ వీడియో

తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో టీఆఎర్ఎస్ విజయం ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జయం జయం అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ సంస్కృతిని, ప్రజల జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ పాటలోని దృశ్యాలను చిత్రీకరించారు. 
 
పాలనకు, నాయకులకు, దక్షతకు, సుస్థిరతకు ప్రజలు పెద్దపీట వేశారని, పథకాలకు, అభివృద్ధికి, భద్రతకు, భరోసాకు ప్రజలు మద్దతు పలికారన్నట్టుగా ఈ పాట సాగుతోంది. సబ్బండ వర్గాలకు, సకల జనుల ఆకాంక్షలకు టీఆర్ఎస్ మాత్రమే మేలుకలిగిస్తుందన్న అర్థం వచ్చేలా సాగే ఈ పాట తెలంగాణ ప్రజలను తెగ ఆకట్టుకుంటోంది. 
 
కాగా, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. తాజాగా సిరిసిల్ల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఘనవిజయం సాధించారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సర్కారు రాబోతున్న నేపథ్యంలో జయం పాటను మీరూ ఓ లుక్కేయండి.