బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (15:33 IST)

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

rs praveen
భారత రాష్ట్ర సమితి నేత, ఐఏఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ప్రభుత్వ అతిథి గృహాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యంగా వరంగల్ గెస్ట్ హౌస్‌లులో మురళి దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. 
 
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వరంగల్లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. 2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. దానికి సాక్ష్యం అప్పుడు సీఐగా ఉన్న ప్రస్తుతం వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అని చెప్పారు.