మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జులై 2024 (18:37 IST)

త్రివిక్రమ్ ఎలాంటివాడో నాకు తెలుసు.. నెటిజన్‌కు పూనం కౌర్ కౌంటర్

poonam kaur
ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనం కౌర్ మరోసారి ఫైర్ అయ్యింది. త్రివిక్రమ్ నుంచి ఇంతకుమించి మంచి కంటెంట్ ఆశించలేమన్న కౌర్ వ్యాఖ్యలను ఓ నెటిజన్ తప్పుబట్టాడు. త్రివిక్రమ్‌పై ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని ఫైర్ అయ్యాడు. 
 
దీనిపై స్పందించిన పూనం కౌర్.. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని చెప్పింది. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని నటి పూనం కౌర్ వెల్లడించింది.
 
ఇంకా ఆ నెటిజన్‌కు కౌంటరిస్తూ.. "ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయిండొచ్చని... కానీ, తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదు." అంటూ తెలిపింది.