గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (12:30 IST)

రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. పూనమ్ కౌర్

poonam kaur
రాజకీయాల్లోకి తనను లాగవద్దు.. తనను పావుగా వాడుకోవద్దు అంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ తెలిపింది. ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీలో చేరలేదని.. రాజకీయ వ్యక్తిని కాదని పూనమ్ స్పష్టం చేసింది. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం తనను ఓ పావుగా వాడుకోవాలని అనుకుంటున్నారు. 
 
మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. తాను సిక్కు బిడ్డ.. త్యాగాలు, పోరాటాలేంటో తనకు తెలుసునని పూనమ్ చెప్పింది. దయచేసి రాజకీయాల కోసం తనను వాడుకోవద్దని పూనమ్ తేల్చి చెప్పేసింది.
 
ఇంకా.. "నేను చేనేత కార్మికుల కోసం శ్రమిస్తున్నాను. 100కి పైగా పార్లమెంట్ సభ్యులని కలిశాను. మహిళల హక్కుల కోసం కూడా పోరాడతాను. నా వైపు నుంచి ఏదైనా తెలియజేయాల్సింది ఉంటే నేనే చెబుతాను" అంటూ పూనమ్ కౌర్ స్పష్టం చేసింది