ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:14 IST)

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: జయసుధ ఫోన్ లాక్కుంటూ ఏం మనిషివమ్మా అంటూ మోహన్ బాబు

Mohan Babu-Jayasudha
ఏఎన్నార్ శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏఎన్నార్ గురించి వక్తలు మాట్లాడుతున్న సమయంలో సీనియర్ నటి జయసుధ తన ఫోనులో ఏదో చూస్తూ కనిపించారు. అంతే... దాన్ని చూసిన మోహన్ బాబుకి చిర్రెత్తుకొచ్చింది.
 
వెంటనే ఆమె చేతి నుంచి ఫోను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఏం మనిషివమ్మా అన్నట్లు చేతితో సైగ చేసారు. అవతల ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ వుంటే ఫోను చూస్తావేంటి అన్నట్లు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు తన మనసులో ఏదీ దాచిపెట్టుకోరనే పేరుంది.
 
కోపం వచ్చినా ముఖం మీదే మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేసేసారు. ఐతే అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఫోన్ లాక్కునేందుకు మోహన్ బాబు ప్రయత్నించడంతో జయసుధ ఒకింత కంగుతిన్నట్లు కనిపించారు.