1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (16:00 IST)

తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం ప్రకటించిన విష్ణు మంచు

Manchu Vishnu, Mohan, Mukesh Kumar Singh
Manchu Vishnu, Mohan, Mukesh Kumar Singh
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు 'కన్నప్ప' చిత్రాన్ని శ్రీ కాళహస్తి లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.
 
 అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. తన తండ్రి లెజెండరీ నటుడు, నిర్మాత శ్రీ మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మిస్తారు. 
 
స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తారు. కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తారు. అలాగే లెజెండరీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్,  తోట ప్రసాద్ కథ కి కీలక మెలికలు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా భక్త కన్నప్ప.  అతని భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం అని విష్ణు అన్నారు. 
 
త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అని అన్నారు. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామని విష్ణు మంచు అన్నారు.