ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 29 జులై 2023 (19:46 IST)

అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి అంటున్న లక్ష్మి ప్రసన్న

mohanbabu-nirmala
mohanbabu-nirmala
మంచు లక్ష్మి ప్రసన్న తన తల్లి తండ్రులను మేలుకోరుతూ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. మంచు మోహన్ బాబు,  మంచు నిర్మల దేవి లకు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవ  సంధర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్దరు చేతులుపట్టుకుని గార్డెన్లో నడుస్తున్న  చేసింది. మంచు మోహన్ బాబు,  ప్రస్తుతం మంచు నిర్మల దేవి లు లండన్ లో వివాహ వేడుకను జరుపుకున్నారు. 
 
లండన్ లో మంచు విష్ణు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు ఉన్నాయి.  వాటి పేరుతోనే హైదరాబాద్ మాదాపూర్ లో కూడా బ్రాంచ్ నెలకొల్పారు. ఇదిలా ఉండగా, లక్ష్మి ప్రసన్న తన స్పందనను ఎలా తెలిపింది మీ ఇద్దరూ జీవితాంతం కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వివాహం సాగుతుందని మీరు నాకు బోధించారు, అందుకు మీ ఇద్దరి వైభవం నిదర్శనం. అమ్మా నీ కలలన్నీ నిజమవ్వాలి, నాన్న నీ  కోరికలన్నీ నెరవేరాలి. మీ ఇద్దరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. అని తెలిపింది.