లండన్‌లో రంగారెడ్డి యువతి హత్య.. ఎంఎస్ కోసం వెళ్లి..?
రంగారెడ్డికి చెందిన యువతి లండన్‌లో హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆమె స్నేహితురాలిపై కూడా దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్రగాయాలతో తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. తేజస్విని ఎంఎస్ కోసం తన స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటోంది.
రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో.. ఘోరం జరిగిందని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.