బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

లండన్‌లో తెలుగు విద్యార్థిని హత్య... కత్తితో పొడిచి చంపేసిన దుండగుడు

murder
లండన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. మృతురాలిని తేజస్విని రెడ్డిగా గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మరో తెలుగు అమ్మాయి అఖిల కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. 
 
హైదరాబాద్ చంపాపేట్‌కు చెందిన తేజస్విని ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌కు వెళ్లింది. తేజస్విని, అఖిల ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్‌లో చదువుతున్నారు. వీరిద్దరిపై దాడిచేసిన బ్రెజిల్‌కు చెందిన దుండగుడు మరో వ్యక్తిపై దాడి చేసి చంపేశాడు. హంతకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తేజస్విని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు.