గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (21:31 IST)

లోన్‌యాప్‌లో అప్పు తీసుకున్నాడు.. కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.. ఎక్కడ?

money
ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్న నామక్కల్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, నామక్కల్ సమీపంలోని చెల్లప్ప కాలనీకి చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి యోగేశ్వరన్. ఈ 22 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ.15,000 రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
అప్పు చెల్లించకపోవడంతో అప్పులిచ్చిన వ్యక్తి తన మొబైల్ ఫోన్ కాంటాక్ట్స్‌లో అందరికీ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఓ దశలో లోకేశ్వరన్ కూడా తన తల్లిదండ్రులను సంప్రదించి డబ్బులు ఇవ్వాలని కోరాడు. కానీ వారు లోకేశ్వర్‌ను మందలించారు. 
 
ఈ నేపథ్యంలో అప్పు తీసుకున్న లోకేశ్వరన్ అప్పు తిరిగి చెల్లించలేక.. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.