మైసూర్: పంజా విసిరిన పులి.. విద్యార్థిని మృతి
మైసూర్‌లోని ఓ కళాశాల విద్యార్థిని చిరుతపులి పంజా విసరడంతో తీవ్రగాయాల కారణంగా మృతి చెందింది. మైసూరుకు చెందిన మేఘన అనే 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని అడవికి సమీపంలో నివసిస్తోంది. రోజూ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా అడవి గుండా ఇంటికి వెళ్లేది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు ముప్పై గంటల సమయంలో కాలేజీ విద్యార్థిని మేఘన ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా చిరుతపులి ఆమెపై దాడి చేసింది. ఆమెపై పంజా విసిరింది. దీంతో మేఘన తీవ్రంగా గాయపడి కాపాడాలంటూ కేకలు వేసింది.
ఆ ప్రాంత ప్రజలు వెంటనే అక్కడికి చేరుకోవడంతో చిరుత జనాన్ని చూసి అడవిలోకి పరుగులు తీసింది. అయితే చిరుతపులి దాడితో మేఘన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది.