1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (13:49 IST)

నవంబర్ 11న ప్రధాని చేతుల మీదుగా భారత్ ఎక్స్‌ప్రెస్

Bharat Express
Bharat Express
భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నవంబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నై- మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది.
 
ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో ఐదవ రైలుగా నిలవనుంది. 
 
మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చారు.