శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (09:26 IST)

మిస్ సౌత్ ఇండియాగా ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ

charishma krishna
మిస్ సౌత్ ఇండియాగా ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థినిగా ఛరిష్మా కృష్ణ ఎంపికయ్యారు. ఆమెకు మిస్ సౌత్ ఇండియా కిరీటం దక్కింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్న ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచింది. 
 
కాగా, ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన  యువతులు పాలుపంచుకున్నారు. వీరందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా... ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే మరోవైపు నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్టర్ రన్నరప్‌గా నిలువగా కర్నాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచింది.