మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (15:33 IST)

ఆంధ్రా యూనివర్సిటీ: చెట్లపై మంచం, పరువులు, ఆ ప్యాకెట్లు.. ఏం జరుగుతుందో?

romance
ఆంధ్రా యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. విచ్చలవిడిగా వ్యభిచారం, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు బయటపడింది. ఇది చూసిన యూనివర్శిటీ అధికారులు అవాక్కయ్యారు. 
 
ఇటీవల యూనివర్శిటీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో తుప్పలు నిండిన ప్రాంతాన్ని వారం రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు.
 
అయితే ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలు తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. 
 
ఆ ప్రాంతంలో వెదురుమొక్కలు గుబురుగా పెరగడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని, ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. అక్కడ భారీ సంఖ్యలో పెట్టెలతో కండోమ్స్ బయటపడ్డాయి.
 
అలాగే భారీఎత్తున ఖాళీ మద్యం బాటిళ్లు కూడా బయటపడ్డాయి. అంతేకాదు... మత్తు ఇంజక్షన్లు కూడా బయటపడ్డాయి.