గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (10:39 IST)

తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి

blast
తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో  ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తమిళనాడు, నామక్కల్, మోగనూరులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
అర్థరాత్రి ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.