శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (08:51 IST)

ఈ నెల 12 నుంచి ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షలు

exam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలను, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. 
 
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 933 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 2,70,583 మంది మొదటి సంవత్సర విద్యార్థులు, 1,41,742 మంది రెండో సంవత్సర విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్లో‌లో ఉంచామని, వీటిని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాలి టిక్కెట్లలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే విద్యార్థులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారిని కలవాలని సూచించారు.