ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 మే 2023 (16:48 IST)

కరాటే కళ్యాణి ని మా సభ్యత్యం నుంచి తప్పించింది ఎవరు?

Karate Kalyani
Karate Kalyani
శక పురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి ముగింపును పురస్కరించుకొని తెలంగాణలో పలు విగ్రహాల అవిష్కరణలు జరుగుతున్నాయి. ఇందులో అనవసరంగా కలగజేసుకున్న కరాటే కళ్యాణి బలి అయింది. ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉండే కరాటే కళ్యాణి కి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చెక్ పెట్టే  స్థాయికి చేరింది. ఎన్ఠీఆర్  విగ్రహాల పెట్టడం పై ఆమె స్పందించిన తీరు సీనిమా పెద్దలకు కోపం తెప్పించింది. దానితో  3రోజుల్లో దానికి సమాధానం ఇవ్వమని ఆమెకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు లిఖిత పూర్వకంగా కోరారు. కానీ ఆమె ఇవ్వలేదు. 
 
దాంతో ఆమెను మా నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మా ప్రకటించింది. కనీసం వారం రోజులు గడువు అడుగుతారు. కానీ 3డేస్ ఏమిటి. అంటూ కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో మాట్లాడుతూ, నేను ఎన్ఠీఆర్ ను కించపరిచే విధంగా మాట్లాడలేదు. కానీ కొందరు నా మాటలు వక్రీకరించి నన్ను టార్గెట్ చేసారని అంది. ఎన్ఠీఆర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. కానీ కృష్ణుడు తరహా విగ్రహాలు కొందరు పెడుతున్నారు. అందుకు కరాటే కళ్యాణి నో చెపుతూ, ఎన్ఠీఆర్ నటనకు నేనూ అభిమానినే. ఆయనకు చాలా విగ్రహాలు ఉన్నాయి. అలాగే పెడదాం. అందుకు న్యాయ పోరాటానికి సిద్ధం అని తెలిపింది. అది పెద్ద రాద్దాంతం జరిగింది. 
 
అప్పటికే ఖమ్మం,  ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కృష్ణుడు తరహా విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఇక సినీ కార్మికులు ఉండే హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ లో కూడా కృష్ణుడు తరహా విగ్రహం రెడీ అయింది. దానికి మంత్రి తలసాని విడుదల చేస్తున్నారు. మొత్తానికి  కృష్ణుడు తరహా విగ్రహం కరాటే కళ్యాణి కి నెగటివ్ అయింది. 
 
మా నిర్ణయం చాలా బాధ వేసింది. అసలు మా కు సంభందం లేని విషయం ఇది. కానీ నన్ను బలి చేశారు. కొందరు పెద్దల ఒత్తిడి వాళ్ళ ఇలా జరిగింది అని తెలిపింది.