మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:22 IST)

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. తలైవర్‌కు స్వాగతం పలికిన నటసింహం

rajini - balakrishna
విజయవాడకు సమీపంలోని పోరంకి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరుగున్నానాయి. ఈ వేడుకల్లో సూపర్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి గన్నవరంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు రజనీకాంత్‌కు నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్, బాలకృష్ణలు ఎయిర్ పోర్టుకు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
rajini - balakrishna
 
మరోవైపు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవసభకు ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఈ సభలో ఎన్టీఆర్ అద్భుత ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు.
rajini - balakrishna
 
అనుమోలు గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభంకానున్న ఈ వేడుకల్లో ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. మొత్తం పది మేల మంది కూర్చొనేందుకు వీలుగా ఇక్కడ కుర్చీలు ఏర్పాటు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించి ఎన్ విభాగంలో విశిష్ట అతిథిలు, విభాగంలో అతిథులు, ఆర్ విభాగంలో సామాన్యులు కూర్చొనే విధంగా వీలుగా ఏర్పాట్లుచేశారు.