శ్రీముఖి ఒకపక్క రొమాన్స్ మరో పక్క ఎమోషన్ అయింది.. ఎందుకనగా !
యాంకర్, నటి శ్రీముఖి ఏ టీవీ షోలో వున్నా సందడి చేస్తుంది. సింగర్స్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్‌లో ఓ సింగర్‌కు ఏకంగా ప్రపోజ్ చేసేసి అతని నాన్నను మామయ్య ఆశీర్వదించండి అంటూ వైరల్ అయింది. ప్రోగ్రామ్ మద్యలో నీయవ్వ.. అంటూ పదాలు పలుకుతూ తెలంగాణ బాషతో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఓంకార్ ఆధ్వర్యంలో రూపొందుతోన్న సిక్త్స్ సెన్స్ షోలో చేసిన సందడి మామూలుగా లేదు. గ్రీన్ డ్రెస్‌తో ఎక్స్‌పోజింగ్ చేస్తూ వస్తూనే బూమ్ బద్దల్ పాటకు డాన్స్ చేసి అలరించింది. మమ్మల్నేమో ఇలా కవర్ చేసుకుని రమ్మని మా బావ (ఓంకార్) ఫుల్ ఎక్స్‌పోజ్ చేస్తారు. .అంటూ అతని ఛాతిపై టచ్ చేసింది. నీ చూపు నా చెస్ట్‌పై పడిందా! అంటూ ఓంకార్ కౌంటర్ వేశాడు.
ఆ తర్వాత మోనాల్ గజ్జర్ చుట్టూ తిరుగుతూ పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. నీ అవ్వ తగ్గేదేలా అంటూ మోనాల్ పిర్రపై ఒకటేసింది. ఇలా సందడి చేస్తూనే.. చివరగా.. ఓ మాట మా అమ్మ చెప్పింది అంటూ... బహుశా మా అమ్మకు ఏదైనా అయితే.. నేను ఎక్కడుకున్నా ఆ విషయం తెలిసినా నువ్వు వెంటనే రాకు. నీ పని పూర్తి అయ్యాక నన్ను చూడడానికి రా.. అంటూ.. అమ్మ పనిపట్ల వున్న డెడికేషన్ గుర్తుచేసిందంటూ.. కాస్త ఎమోషనల్‌గా చెప్పింది. దీంతో కొద్దిసేపు అందరూ సైలెంట్ అయ్యారు.