శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (20:24 IST)

రజనీకాంత్ పర్ఫెక్ట్... అన్నీ నిజాలే చెప్పారు : జగపతిబాబు

jagapathi babu
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆ సమయంలో చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ఏపీలోని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో హీరో జగపతి బాబు కూడా తన స్పందన తెలిపారు. పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 
 
ఆ గొడవ గురించి తనకు తెలియదు. అయితే, రజనీకాంత్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పారు. ఆయన చాలా పద్దతిగా మాట్లాడతారని, అన్నీ నిజాలే మాట్లాడతారని చెప్పారు. రజనీని వైకాపా నేతలు టార్గెట్ చేస్తున్నారని దానిపై స్పందిస్తూ మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని జగపతిబాబు చెప్పారు.