మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (11:40 IST)

కృత్రి మేధతో పోలిస్తే మానవ మేథస్సే అగ్రస్థానం : ఏఐ పితామహుడు హింటన్

Artificial Intelligence
ప్రపంచానికి కృత్రి మేథ (ఏఐ) ప్రమాదకరమని, ప్రస్తుతానికి కృత్రిమ మేథతో పోలిస్తే మానవ మేథస్సే అగ్రస్థానంలో ఉందని ఏఐ పితామహుడు జాఫ్రీ హింటన్ అన్నారు. భవిష్యత్‌లో చాట్ బోట్స్ మానవ మేథను అధికమిస్తాయని, అపుడు పెను సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగ్నిటివ్ సైకాలజిస్టు, గూగుల్ సాధారణ ఉద్యోగి నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి కృత్రిమ మేథ అభివృద్ధికి అహరహం కృషి చేసిన హింటన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన రోబో, రోబో-2.0 చిత్రాల్లో రజనీకాంత్ రూపొందించిన రోబో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగి, ఓ రోబో సామ్రాజ్యాన్ని స్థాపించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు తెల్సిందే. ఇప్పుడు అచ్చంగా అదేవిధంగా చాట్ బోట్లు 'అధికారం' కోసం ప్రయత్నిస్తే మానవాళికి ముప్పు తప్పదని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
చాట్ బోట్లు కొత్త విషయాలను వేగంగా గుర్తిస్తాయని, వాటిని ఇట్టే నేర్చుకుంటాయని హింటన్ తెలిపారు. 'ఒక కంపెనీలో 10 వేల మంది పనిచేస్తే, వారిలో ఒక్కరు కొత్త విషయాన్ని నేర్చుకుంటే, దాన్ని మిగతా అందరికీ నేర్పించడం సాధ్యం కాదు. అదే 10 వేల చాబోబోట్లలో ఒక్కటి కొత్త విషయాన్ని నేర్చుకున్నా.. వెంటనే అన్నింటికీ ఆ అంశాన్ని నేర్పిస్తాయి' అని వివరించారు.