గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (18:57 IST)

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చంద్రబాబు తేనీటి విందు

rajini - babu
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేనీటి విందు ఇచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. విజయవాడలోని పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. 
 
ఇందుకోసం ఏపీకి వచ్చిన ఆయనకు చంద్రబాబు తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. రజనీకాంత్ రాకకు ముందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన దక్షిణాది సూపర్ స్టార్‌కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. 
 
టీడీపీ అధినేత ఇంట తేనీటి విందులో రజనీకాంత్, నటుడు బాలకృష్ణ, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. కానీ, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అథిగా పాల్గొనేందుకు రజనీకాంత్ రాష్ట్రానికి వచ్చారు. కాగా, శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రజనీకాంత్‌కు బాలకృష్ణ స్వాగతం పలికారు.