ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (14:40 IST)

మళ్లీ తాతయ్య అయిన రఘువీరా రెడ్డి.. శుభాకాంక్షల వెల్లువ

Raghuveera Reddy
Raghuveera Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా వున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబం గడుపుతున్నారు. అప్పుడప్పుడు కొన్ని పోస్టులతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇందులో రఘువీరారెడ్డి మనవరాలితో చేసే లూటీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
గతంలో తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. తాజాగా రఘువీరారెడ్డి మళ్లీ తాత అయ్యారు. రఘువీరా రెడ్డికి మనవడు వచ్చేశాడు. దీంతో సోషల్ మీడియాలో రఘువీరారెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారసుడు వచ్చాడంటూ కామెంట్లు వస్తున్నాయి.