ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:28 IST)

వదినమ్మ సీరియల్‌ నటి ప్రియాంక మధుకు పండంటి బిడ్డ

priyanka madhu
priyanka madhu
వదినమ్మ సీరియల్‌లో సిరి పాత్ర పోషిస్తున్న ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  జీ తెలుగులో ప్రసారమైన మంగమ్మ గారి మనవడులో నటించే మధుబాబు ఆమె భర్త. నటి ప్రియాంక నాయుడుతో లవ్.. ఇద్దరు కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. 
 
పెళ్లితో సర్ప్రైజ్ చేసిన ఈ జంట.. తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ఇక తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరు ఈ ఆనందకరమైన విషయాన్నీ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
 
పైగా పుట్టింది బాబునా లేక పాపనా? మీరే చెప్పాలంటూ ఓ వీడియో కూడా పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక మధుల వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.