1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (17:28 IST)

చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లతో యువతి హైదరాబాద్-నాగోల్ రోడ్డుపై నానా హంగామా - video

Drunken youths
Drunken youths
నాగోల్ పరిధి ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకు బీర్లు తాగుతూ ఓ జంట హల్‌చల్ చేసింది. రోడ్డుపై కారును ఆపి చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లు చేతపట్టి నానా హంగామా సృష్టించింది. అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పిన వాకర్స్‌తో ఆ జంట గొడవకు దిగారు. 
 
గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఆ జంట ఉడాయించింది. బహిరంగంగా బీరు బాటిల్‌తో ఉన్న యువతీ యువకులను చూసిన స్థానికులు.. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరూ వారిపై విరుచుకుపడ్డారు. 
 
అందరూ చూస్తుండగానే అసభ్య పదజాలంతో ఎదురు దాడి చేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు వీడియో చిత్రీకరించడంతో వారిపై రుసరుసలాడింది ఆ యువతి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.