1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 మే 2024 (21:24 IST)

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

Dr Vinitha
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్‌తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది. అయినప్పటికీ, మల్టీడిసిప్లినరీ విధానం, అత్యాధునిక సాంకేతికతతో, ఏఓఐ లోని రేడియేషన్ బృందం రోగి యొక్క అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించింది.
 
రోగి మొదట్లో పురీషనాళ రక్తస్రావం (PR) యొక్క సమస్యతో వచ్చారు. నిష్ణాతులైన డాక్టర్ వినీతారెడ్డి మార్గదర్శకత్వంలో, రోగికి ఏకకాలిక కీమోరేడియేషన్ జరిగింది, అనుసరించి కీమోథెరపీ చేయటంతో కణితి పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణం చేత శస్త్రచికిత్సను నివారించగలిగారు. లేదంటే, అబ్డోమినల్ పెరినియల్ రిసెక్షన్ (పురీషనాళం, పాయువుతో పాటుగా ఉదరం యొక్క ఉపరితలంపై జతచేయబడిన పేగు చివరను తొలగించడం), శాశ్వత కోలోస్టోమీ చేయాల్సి ఉండేది. ఈ చికిత్స అందించి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలమే అయింది. ఎంఆర్ఐ, కోలనోస్కోపీ చేసినప్పటికీ,  వ్యాధికి సంబంధించిన ఎటువంటి రుజువూ ఇప్పుడు కనిపించలేదు.
 
డాక్టర్ వినీత రెడ్డి మాట్లాడుతూ, "రెక్టల్ క్యాన్సర్‌ పరంగా మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రత్యేక చికిత్సా విధానం అవసరం. మా బృందం ట్రూబీమ్ ర్యాపిడ్ ఆర్క్ రేడియేషన్ థెరపీతో సహా అధునాతన పద్ధతులను ఉపయోగించి, కణితిని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించింది. తద్వారా కణితి చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి హానిని తగ్గించగలిగారు. రోగి సైతం చికిత్సను బాగా తట్టుకున్నారు. ఇది విజయవంతమైన చికిత్సా ఫలితానికి మార్గం సుగమం చేసింది" అని అన్నారు. 
 
ట్రూ బీమ్ రాపిడ్ ఆర్క్ రేడియేషన్ థెరపీ క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన సాంకేతిక పురోగతిని సూచిస్తుంది. ఈ అత్యాధునిక యంత్రం చికిత్స సమయం తగ్గించటంతో పాటుగా అత్యంత ఖచ్చితమైన రేడియేషన్ కిరణాలను అందిస్తుంది, రోగి సౌకర్యాన్ని, చికిత్స సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏఓఐ యొక్క రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO) డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ, "చికిత్స ఫలితాలను మెరుగుపరచడానికి, క్యాన్సర్ సంరక్షణలో అత్యాధునిక సాంకేతిక పురోగతులను ఉపయోగించుకోవడానికి ఏఓఐ వద్ద మేము అంకితభావంతో కృషి చేస్తున్నాము. ఆవిష్కరణ పట్ల మా నిబద్ధత,  సంప్రదాయ విధానాలకు మించి విస్తరించి ఉంది. ట్రూ బీమ్ రాపిడ్ ఆర్క్ వంటి అధునాతన రేడియేషన్ థెరపీ ప్లాట్‌ఫారమ్‌లతో సహా మా వద్ద ఉన్న అత్యాధునిక పరికరాలు, సాంకేతికతలతో మేము రోగులకు అత్యంత ప్రభావవంతమైన, ఖచ్చితమైన చికిత్సా ఎంపికలను అందించడానికి ప్రయత్నిస్తుంటాము. ఉత్తమమైన ఫలితాలు, జీవన నాణ్యత కు భరోసా అందిస్తున్నాము " అని అన్నారు.