మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జూన్ 2025 (12:13 IST)

Duvvada Srinivas: కూతురు హాఫ్ శారీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ ఇరగదీసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి

Duvvada srinivas divvala Madhuri
Duvvada srinivas divvala Madhuri
దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి హాఫ్ శారీ ఫంక్ష‌న్ హైదరాబాదులో జరిగింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మ‌రోసారి త‌మ డ్యాన్స్‌తో అల‌రించింది. అదిరే స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుక‌లో వీరిద్ద‌రూ క‌లిసి హిందీ డ్యూయెట్ పాట‌కు స్టెప్పులేశారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో  వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ద‌వ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కాగా దువ్వాడ, దివ్వెల జంట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ వకుళ సిల్క్స్ పేరిట ఈ జంట హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.

దీంతో ఇటీవల ఎక్కువగా ఈ జంట హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాధురి తన కుమార్తె ఆఫ్ శారి ఫంక్షన్‌ను హైదరాబాద్ లోనే జరిపించారు. ఈ వేడుకను శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది. 
 
ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్‌లో అంతా తానై వ్యవహరించారు. ఈ ఫంక్షన్‌కి శ్రీకాకుళం జిల్లాకి చెందిన సెలెక్టెడ్ పర్సన్‌ని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని పలువురు రియల్టర్లు, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు.