బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (13:38 IST)

నిలోఫర్ ఆస్పత్రిలో పేకాట.. నలుగురు మహిళల అరెస్ట్

playing cards
నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తులో పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా సరస్వతి నగర్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తులోని ఓ గదిపై పోలీసులు దాడి చేసి వైద్యుల కుటుంబాలకు చెందిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 
 
నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన సౌందర్య, లత, కళావతి, గంగులు అనే వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, మొబైల్‌ ఫోన్లు, కార్డులు స్వాధీనం చేసుకున్నారు.