రూ.2,42 కోట్ల నకిలీ యాపిల్ ఉపకరణాలు విక్రయించిన ముఠా అరెస్ట్
హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం, అబిడ్స్ పోలీసులతో కలిసి జగదీష్ మార్కెట్‌లోని నాలుగు దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ యాపిల్ ఐఫోన్ బ్రాండ్ యాక్సెసరీలను విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్నారు.
2.42 కోట్ల విలువైన యాపిల్ బ్రాండ్ మొబైల్ యాక్సెసరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ షాప్ యజమాని నింబ్ సింగ్ (25)ని పోలీసులు అరెస్టు చేశారు.
పటేల్ మొబైల్ షాపుకు చెందిన హీరా రామ్ (24), ఔషపురా మొబైల్ షాపుకు చెందిన గోవింద్ లాల్ చౌహాన్ (45), నంది మొబైల్స్‌కు చెందిన ముఖేష్ జైన్ (32)లను అదుపులోకి తీసుకున్నారు.
ఇకపోతే.. 579 ఎయిర్‌పాడ్స్ ప్రో, 351 యూఎస్‌బీ అడాప్టర్లు, 747 యూఎస్‌బీ పవర్ కేబుల్స్, 62 బ్యాటరీలు, 17 పవర్ బ్యాంక్‌లు, 1,401 బ్యాక్ పౌచ్‌లు మొత్తం రూ.2,42,55,900 స్వాధీనం చేసుకున్నారు.