సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (16:23 IST)

హైదరాబాద్ రెస్టారెంట్‌ బిర్యానీలో స్లైడ్ పిన్.. నెట్టింట ఫోటో వైరల్

Mehfil Biryani
Mehfil Biryani
మణికొండలోని మెహఫిల్ రెస్టారెంట్ నుండి శనివారం ఆర్డర్ చేసిన బిర్యానీలో హెయిర్ పిన్ ఉన్నట్లు ఒక కస్టమర్ స్విగ్గీ ద్వారా నివేదించారు. స్లైడ్ పిన్‌తో కూడిన బిర్యానీ ఫోటోను కస్టమర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ట్యాగ్ చేశాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేశాడు. 
 
హైదరాబాద్ మణికొండ రెస్టారెంట్ నుండి మెహ్ఫిల్ బిర్యానీలో సేఫ్టీ పిన్ వచ్చింది. ఎంత బాధ్యతారాహిత్యం.. అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఈ ఘటనను గుర్తించిన హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే స్పందించి, ఆ స్థలం తమ పరిధిలోకి వస్తుంది కాబట్టి సైబరాబాద్ పోలీసులను సంప్రదించాల్సిందిగా ఫిర్యాదుదారుని ఆదేశించారు.