సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (17:17 IST)

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

Viraj Ashwin, Puranapanda Srinivas and others
Viraj Ashwin, Puranapanda Srinivas and others
తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘సినీ రంగంలోకి వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారని, ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వృక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడద’ని అన్నారు.
 
ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫర్‌గా నితిన్ రెడ్డి చిమ్ముల , ఎడిటర్‌గా అఖిల్ దేశ్‌పాండే పని చేస్తున్నారు.