1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (16:36 IST)

నా పేరు నాని పెట్టుకుంటే థ్రిల్ గా ఉంది : విరాజ్ అశ్విన్‌

Viraj Ashwin
Viraj Ashwin
హాయ్ నాన్న‌, యానిమ‌ల్‌, తాజాగా జోరుగా హుషారుగా, రాబోయే సైంద‌వ్ సినిమా అన్ని ఫాద‌ర్ ఎమోష‌న్ సినిమాలే.  అన్ని ఈ నెల‌లో విడుద‌ల కావ‌డం విశేషం. హాయ్ నాన్న సినిమాలో బేబి చిత్రంతో యువ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్‌ నటించాడు. ఆ సినిమాలో నాని పేరు విరాజ్. ఈ పేరు పై విరాజ్ స్పంద‌న‌ ఎలావుందంటే.. హాయ్ నాన్న‌చిత్ర ద‌ర్శ‌క‌త్వం టీమ్ అంతా నా ఫ్రెండ్స్ కావ‌డంతో ఆ సినిమాలో న‌టించాను. ఆ చిత్రంలో నాని విరాజ్ పాత్ర‌లో  క‌నిపించ‌డం నిజంగా కో ఇన్‌సిండెంట్ అంతే. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విరాజ్ అంటే నేను ప‌ల‌క‌డం, హాయ్ నాన్న ప్రీరిలీజ్ వేడుక‌లో విరాజ్ అన‌గానే అంద‌రూ నేను అనుకోవడం, ఇలా చాలా ఫ‌న్నీగా, సంతోషంగా అనిపించింది అన్నారు.
 
 విరాజ్ అశ్విన్‌ హీరోగా న‌టించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భం గా విరాజ్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. న‌చ్చిన పాత్ర‌లు, ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా క‌నిపిస్తాను అని తెలిపారు.