శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (18:32 IST)

మొన్న నానిని కిస్ చేసిన చిరంజీవి నేడు అభినందించిన అల్లు అర్జున్

Alluarjun- nani-chiru
Alluarjun- nani-chiru
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న' అన్ని వైపుల నుంచి ప్రశంసలను పొందుతోంది. ఇటువంటి అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో వచ్చినందుకు చాలా మంది ప్రముఖులు నాని, టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. అల్లు అర్జున్ 'హాయ్ నాన్న' టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ రాశారు. ఇటీవలే ఉస్తాద్ అనే షో లో చిరాజంజీవి హాయ్ నాన్న చూసి ఆనందంతో నాని ని కిస్ చేశారు. 
 
“హాయ్ నాన్న మొత్తం టీమ్‌కి అభినందనలు. ఎంతో మధురమైన చిత్రమిది. నిజంగా మనసుని హత్తుకుంది. బ్రదర్ నాని గారు అద్భుతమైన నటన కనపరిచారు. ఇటివంటి మంచి కథను చేసినందుకు చాలా గౌరవంగా వుంది. డియర్ మృణాల్. మీ స్వీట్ నెస్ తెరపై వెంటాడుతోంది. మీలాగే అందంగా ఉంది. బేబీకియారా !మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో మనసుని ఆకట్టుకున్నావ్. చాలు..ఇక స్కూల్ కి వెళ్ళు