బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (18:08 IST)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి : చిరంజీవి ట్వీట్

Revanth Reddy, Chiranjeevi
Revanth Reddy, Chiranjeevi
ఈరోజు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరంచిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆయనతో కలిసిన ఫొటోను షేర్ చేశారు. ఇప్పటికే తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు జర్నలిస్టు సంఘాలు, పలువురు నిర్మాతలు రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
చిరంజీవి ట్వీట్ లో.. మీ నాయకత్వంలో మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. సినిమా రంగంలో కూడా మరింత సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రేవంత్ రెడ్డి గెలుపు సందర్భంగా పలువురు నిర్మాతలు  ఆనందం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో థియేటర్ల సమస్యలు, టాక్స్ విషయంలో మరింత సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.