బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (19:52 IST)

త్వరలో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలువనున్న సినిమా పెద్దలు

Allu aravind-bandal ganesh
Allu aravind-bandal ganesh
తెలంగాణ సి.ఎం.గా రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం ప్రకటించగానే పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం పొంగి పొర్టింది. అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ ఆనందం నెలకొంది. ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు చాలా సందడిగా కనిపించారు. సినిమారంగంలోని సమస్యలు కంటే ముందు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. సమయం చూసుకుని ఆయన్ను కలవనున్నట్లు పెద్దలు నిర్ణయించారు.
 
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల ఇటీవలే అల్లు అరవింద్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.  తాము సమయం చూసి ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.  ఇక గతంలో పెండింగ్లో వున్న సినిరంగ సమస్యలు ఈసారి పరిష్కారం అవుతాయని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున, నిర్మాత రామ్మోహన్ రావు వంటివారు, మోహన్ బాబు వంటి వారు ఈసారి ఆయన్ను కలిసే సూచనలు వున్నాయి. గతంలో నాగార్జున నటించిన ఓ సినిమా ఫంక్షన్ కు రేవంత్ రెడ్డి, సీతక్క లు హాజరయ్యారు. ఇలా పలువురు సినీ పెద్దలు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెపుతూ ట్వీట్లు చేశారు. ఇప్పటికే బండ్లగణేష్ శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఆయన ఎఫ్.డి.సి. పదవికోసం ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి.